దత్తన్నకు అవమానం
తమ రాష్ట్ర గవర్నర్ కు అవమానం జరిగిందని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది
తమ రాష్ట్ర గవర్నర్ కు అవమానం జరిగిందని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఇటవల చంఢీగడ్ లో నిర్వహించిన ఎయిర్ షోకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. అయితే చండీగడ్ పాలనాధికారి బన్వరీలాల్ పురోహిత్ రాష్ట్రపతి పక్కసీట్లో కూర్చున్నారు. దత్తాత్రేయకు మాత్రం రెండు సీట్ల తర్వాత కూర్చోబెట్టారు. ఇది వివాదానికి దారి తీసింది. దీనిపై హర్యానా ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది.
ప్రొటోకాల్ పాటించలేదని...
తమ గవర్నర్ కు అవమానం జరిగిందని, ప్రొటోకాల్ పాటించలేదని పేర్కొంది. రాష్ట్రపతి పాల్గొనే కార్యక్రమాల్లో ప్రధాని, ఉప రాష్ట్రపతి పాల్గొనకపోతే రాష్ట్రపతి పక్క సీటును ఆ గవర్నర్ కు కేటాయించాల్సి ఉంది. రాష్ట్రపతి పక్కనే హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కూర్చోవాల్సి ఉండగా దానిని అధికారులు పట్టించుకోలేదన్నారు. అయితే ఎయిర్ షో నిర్వాహకులు మాత్ం హర్యానా రాజ్ భవన్ సిబ్బంది పొరపాటు కారణంగాణే ఈ తప్పిదం జరిగిందన్నారు. సీటింగ్ ను పరిశీలించేందుకు ఎవరూ ముందు రాలేదని, దీనివల్ల తప్పిదం జరిగిందని వివరణ ఇచ్చింది.