ఆగని పసిడి పరుగులు.. స్థిరంగా వెండి

తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.48,260..

Update: 2022-11-14 03:40 GMT

gold and silver prices today

బంగారం ధరల్లో ప్రతినిత్యం మార్పులు సహజం. ఒకరోజు తగ్గితే.. మరోరోజు అంతకు రెట్టింపుగా బంగారం ధర పెరుగుతుంటుంది. ఒక్కేసారి వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తుంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో.. బంగారం కొనుగోలుకు డిమాండ్ ఏర్పడింది. రేటు ఎంతైనా.. కొనేందుకు వెనుకాడట్లేదు కొనుగోలుదారులు. కానీ.. సామాన్యుడు బంగారం కొనాలంటేనే భయపడే రీతిలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. తాజాగా బంగారం ధర మళ్లీ పెరుగగా.. వెండి ధర స్థిరంగా ఉంది.

తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.48,260 కి చేరగా.. 24 క్యారెట్ల ధర రూ.52,640కి పెరిగింది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,260గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,500 ఉండగా.. విజయవాడ, విశాఖ నగరాల్లోనూ ఇవే ధరలున్నాయి.


Tags:    

Similar News