వరుసగా మూడోరోజు తగ్గిన బంగారం ధర..

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,370, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో..

Update: 2022-05-15 03:06 GMT

న్యూఢిల్లీ : పసిడి ప్రియులకు పండగే. వరుసగా మూడోరోజు బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,370, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లు రూ. 46,250, 24 క్యారెట్లు రూ.50,450 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,450, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670గా స్థిరంగా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,450గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 50,450 కి తగ్గింది.

తెలుగురాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,670గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,450కి తగ్గింది.
బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్, చెన్నై, కేరళ, బెంగళూరు, విజయవాడ నగరాల్లో కిలో వెండి ధర రూ.63,700కి పెరిగింది. కోల్ కతా, ఢిల్లీ, ముంబై నగరాల్లో కేజీ వెండి ధర రూ.59,400గా ఉంది.


Tags:    

Similar News