దాదా రెడీ... ముహూర్తమే తరువాయి..!

క్రికెట్ లో సంచనాలను నమోదు చేసిన గంగూలీ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఆయన త్వరలోనే బీజేపీలో చేరే అవకాశాలన్నాయి

Update: 2022-06-01 12:51 GMT

భారత క్రికెట్ లో సంచనాలను నమోదు చేసిన సౌరవ్ గంగూలీ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఆయన త్వరలోనే బీజేపీలో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి. సౌరవ్ గంగూలీ గత నెలలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రెండు సార్లు భేటీ అయి పార్టీలో తనకు లభించే ప్రాధాన్యతపై చర్చించారని చెబుతున్నారు. పశ్చిమబెంగాల్ లో బీజేపీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం బాగా పెరిగింది. అధికారం దక్కకపోయినా మమతను ఓడించినంత పనిచేసింది. అయితే అక్కడ సరైన నాయకత్వం అవసరమని బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా భావిస్తుంది.

ట్వీట్ ద్వారా....
సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరితే పశ్చిమ బెంగాల్ బాధ్యతలను అప్పగిస్తారా? లేక మరో కీలక పదవిని ఇస్తారా? అన్నది బెంగాల్ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. సౌరవ్ గంగూలీ చేసిన ట్వీట్ కూడా ఇందుకు అద్దం పడుతుంది. తాను ఇప్పటి వరకూ 30 ఏళ్ల పాటు క్రికెట్ కు సేవ చేశానని, తన జీవితంలో కొత్త అధ్యాయానికి మద్దతు దొరుకుతుందని భావిస్తున్నానని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక ఎక్కువ మంది ప్రజలకు సేవ చేసే అవకాశం కలుగుతుందని ఆశిస్తున్నానని చెప్పారు. దీంతో సౌరవ్ గంగూలీ పొలిటికల్ ఎంట్రీ ఖాయమైంది. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఆ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దాదా ఎంట్రీతో బెంగాల్ రాజకీయాలు హీటెక్కనున్నాయి.


Tags:    

Similar News