లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కుమారుడు అరెస్ట్

ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ ను లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు

Update: 2025-09-25 04:38 GMT

ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్ గఢ్ లో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో గత కొద్ది రోజులుగా విచారణ జరుగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చైతన్య బఘేల్ ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పర్చారు. చైతన్య బఘేల్ తో పాటు మరొక వ్యక్తి దీపెస్ చావ్డాను కూడా అదుపులోకి తసీుకున్నారు. ఇద్దరికీ వచ్చే నెల 6వ తేదీ వరకూ కోర్టు కస్టడీకి అప్పగించింది.

2,500 కోట్ల స్కామ్ అంటూ...
2019 నుంచి 2022 వరకూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గా భూపేశ్ బఘేల్ పనిచేశారు. ఈ సమయలోనే లిక్కర్ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో దీనిపై ప్రస్తుత ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ స్కామ్ లో చైతన్య బఘేల్ కీలక భూమిక పోషించారని, మొత్తం స్కామ్ విలు 2,500 కోట్ల రూపాయలని అధికారులు తెలిపారు. వెయ్యి కోట్ల రూపాయల అక్రమ ఆదాయాన్ని చైతన్య పొందారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిపారు. దీనిపై కస్టడీలో పూర్తి స్థాయి విచారణ ను జరపనున్నారు.


Tags:    

Similar News