వరుసగా ఐదు సార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రులు ఎవరో తెలుసా? ఆ జాబితాలో నిర్మలమ్మ

Budget:ఇక వచ్చే ఏడాది బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. బడ్జెట్‌ తయారీలో తలమునుకలవుతుంటుంది కేంద్రం. అన్ని వర్గాల వారికి మెప్పించే

Update: 2023-12-25 03:00 GMT

Nirmala Sitharaman Budget 2024

Budget:ఇక వచ్చే ఏడాది బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. బడ్జెట్‌ తయారీలో తలమునుకలవుతుంటుంది కేంద్రం. అన్ని వర్గాల వారికి మెప్పించే విధంగా బడ్జెట్‌ను తయారు చేయడం ఒక సవాలు అనే చెప్పాలి. ఈ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు. వరుస బడ్జెట్‌లను ప్రవేశపెడుతున్న ప్రముఖుల్లో నిర్మలమ్మ చేరిపోయారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ 2019 నుండి వరుసగా ఆరవ బడ్జెట్‌ను ఈ ఫిబ్రవరిలో సమర్పించబోతున్నారు.

ఐదు సార్లు వరుసగా కేంద్ర బడ్జెట్‌లను అందించిన ఆర్థిక మంత్రుల జాబితాలో చేరారు నిర్మలమ్మ. వరుస బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత మొరార్జీ దేశాయ్, మన్మోహన్ సింగ్, పి చిదంబరం, యశ్వంత్ సిన్హా, అరుణ్ జైట్లీ వంటి ప్రముఖులు ఉన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నందున ఇది మధ్యంతర బడ్జెట్‌గా పరిగణిస్తారు. బడ్జెట్ తయారీ ప్రక్రియ సాధారణంగా సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది. బడ్జెట్‌ను రూపొందించడం అనేది అనేక దశలు, సంప్రదింపులను కలిగి ఉండి సమయం తీసుకునే ప్రక్రియ.

బడ్జెట్‌ను రూపొందించే క్లిష్టమైన ప్రక్రియ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అనేక ఆర్థిక ప్రతిపాదనలను కలిగి ఉంటుంది. బడ్జెట్‌ను తయారు చేయడం చాలా క్లిష్టంగా ఉంటుంది. అన్ని వర్గాల వారికి సమానమైన బడ్జెట్‌ను రూపొందించాల్సి ఉంటుంది. భారతదేశంలోని కేంద్ర బడ్జెట్ కొద్ది రోజుల్లో ఫలించేది కాదు. ఇది తుది డ్రాఫ్ట్‌లో ముగియడానికి కొన్ని నెలల పాటు ఖచ్చితమైన ప్రణాళిక, సంప్రదింపులు, సంకలన ప్రయత్నాలను కలిగి ఉంటుంది. కేంద్ర బడ్జెట్‌ను రూపొందించడానికి ప్రభుత్వం ఎన్నో రకాల చర్చలు, సమావేశాలు జరిపిన తర్వాత బడ్జెట్‌ తుది దశకు చేరుకుంటుంది.

Tags:    

Similar News