Breaking : ఢిల్లీలో భారీ పేలుడు.. ఎర్రకోట సమీపంలో
ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఢిల్లీ ఎర్రకోట వద్ద ఈ పేలుడు జరిగింది. ఒక కారులో ఈ పేలుడు జరిగినట్లు తెలిసింది.
ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఢిల్లీ ఎర్రకోట వద్ద ఈ పేలుడు జరిగింది. ఒక కారులో ఈ పేలుడు జరిగినట్లు తెలిసింది. ఈ పేలుడు ధాటికి ఐదు కార్లు ధ్వంసమయినట్లు సమాచారం. ఈ పేలుడులో ఇద్దరికి గాయాలయ్యాయని చెబుతున్నారు. ఎర్రకోట వద్ద ఉన్న మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న కారులో ఈ పేలుడు సంభవించినట్లు ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టితెలుస్తుంది.
పోలీసులు స్పాట్ కు చేరుకుని...
అయితే సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతాదళాలువెంటనే అప్రమత్తమయ్యారు. సంఘటన స్థలికి వచ్చి పరిశీలిస్తున్నారు. కారు ఎక్కడిది? ఎవరి పేరు పైన రిజిస్టర్ అయి ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎర్రకోట వద్దకు పెద్దయెత్తున పర్యాటకులు వస్తున్న సమయంలో ఈ పేలుడు జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాఫిక్ ను కూడా దారి మళ్లిస్తున్నారు. అక్కడ ఉన్న వారిని ఖాళీ చేయించి పేలుడు సామగ్రిని మరెక్కడ ఉందేమోనని పరిశీలిస్తుననారు.