ఎవరికి ఓటు వేయాలో చెప్పిన వెంకయ్య

పార్టీ మారిన నేతలు పార్టీకి, పదవికి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు

Update: 2024-04-23 05:53 GMT

పార్టీ మారిన నేతలు ఆ పార్టీకి, పదవులకు రాజీనామా చేసి తర్వాత వేరే పార్టీలో చేరాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పార్టీ మారకుండా ఆ పార్టీపై విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలోనయినా చేరవచ్చన్న వెంకయ్యనాయుడు ఆ పదవిలో కొనసాగుతూ విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. పద్మవిభూషణ్ తీసుకున్న సందర్భంగా ఢిల్లీ మీడియా సత్కరించిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ రాజీనామాలు చేయకుండా పార్టీలు మారడం మంచి సంప్రదాయం కాదన్నారు. యాంటీ డిఫెక్షన్ బిల్ ను బలోపేతం చేయాలన్నారు.

ఉచితాలకు తాను వ్యతిరేకమని...
మరోవైపు తాను ఉచితాలకు వ్యతిరేకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరికైనా ఓటు వేయండి కానీ అవినీతిపరులకు మాత్రం ఓటు వేయవద్దని వెంకయ్యనాయుడు సూచించారు. విద్య,వైద్యం మాత్రమే ఉచితంగా పేదలకు ఇవ్వాలని, మిగిలిన ఉచితాలు ఏవీ ఇవ్వవద్దని ప్రజలే తిరస్కరించాలని వెంకయ్యనాయుడు పిలుపు నిచ్చారు. అసభ్యంగా మాట్లాడే వారిని ప్రజలు తిరస్కరించాలని కూడా కోరారు. అప్పులు చేసి ఉచితాలను పంచిపెట్టడం సరికాదని వెంకయ్య అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News