అయోధ్య రాముడిని దర్శించుకున్న ఎలాన్ మస్క్ తండ్రి

స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్నారు.

Update: 2025-06-05 07:39 GMT

erolmusk

స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్నారు. భారతీయ సంప్రదాయ కుర్తా పైజామా ధరించి, గర్భాలయంలో బాలరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్యలోని హనుమాన్ గర్హీ ఆలయాన్ని కూడా ఎరోల్ మస్క్ దర్శించుకున్నారు. ఆయన వెంట కుమార్తె అలెగ్జాండ్ర మస్క్ కూడా ఉన్నారు.


అయోధ్య ఆలయాన్ని దర్శించుకున్న తరువాత ఎరోల్ మస్క్ స్పందించారు. అయోధ్య రామాలయ దర్శనం చాలా అద్భుతమైన, మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని, నేను ఇప్పటి వరకు చేసిన గొప్ప పనుల్లో ఇది ఒకటని అన్నారు. ఆలయాన్ని దర్శించడం చాలా సంతోషంగా ఉందని, ఈ ఆలయం చాలా అందంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ఇది అద్భుతమైన దేవాలయం అవుతుందంటూ ఎరోల్ మస్క్ చెప్పారు.

Tags:    

Similar News