టెన్షన్ పెడుతున్న పంజాబ్ రిజల్ట్

పంజాబ్ లో ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పోటా పోటీగా ఆధిక్యాన్ని కనపరుస్తున్నాయి.

Update: 2022-03-10 03:51 GMT

పంజాబ్ లో ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పోటా పోటీగా ఆధిక్యాన్ని కనపరుస్తున్నాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం 44 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ 33 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుంది. శిరోమణి అకాలీదళ్ 13 స్థానాల్లోనూ, బీజేపీ మూడు స్థానాల్లోనూ ఆధిక్యత కనపరుస్తున్నాయి.

పోటాపోటీగా....
ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఆ విధంగానే ఆధిక్యత ఉన్నా కాంగ్రెస్, బీజేపీల మధ్య ఆధిక్యత స్వల్ప సంఖ్యలోనే ఉండటం విశేషం. పటియాలలో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వెనుకంజలో ఉన్నారు.


Tags:    

Similar News