నేడు ఉప రాష్ట్రపతి ఎన్నిక

భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడు జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి

Update: 2025-09-09 01:51 GMT

భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడు జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పార్లమెంటు కొత్త భవనంలో పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం ఆరు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం సభ్యుల సంఖ్య 788 అయినా ఏడు స్థానాలు ఖాళీగా ఉండటంతో మొత్తం 781 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఇందులో బీఆర్ఎస్ కు చెందిన నలుగురు,, బీజడీకి చెందిన ఏడుగురు ఎన్నికకు దూరంగా ఉన్నారు.

అత్యధిక సభ్యుల మద్దతు...
దీంతో 388 సభ్యుల మద్దతు పొందిన వారు విజేతగా నిలవనున్నారు. ఎన్డీఏకు 425 మంది సభ్యుల బలం ఉంది. ఇండికూటమి అభ్యర్ధికి 314 మంది సభ్యులున్నారు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన పదకొండు మంది సభ్యులు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించాయి. దీంతో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ విజయం నల్లేరు మీద నడకే అయింది. ఇక ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాత్రం క్రాస్ ఓటింగ్ పై నమ్మకం పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ అధికారులు పూర్తి చేశారు.


Tags:    

Similar News