బ్రేకింగ్ : సర్కార్ ను బర్త్‌రఫ్ చేయండి.. గవర్నర్ కు లేఖ

మహారాష్ట్ర గవర్నర్ కు ఏక్‌నాథ్ షిండే లేఖ రాశారు. ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని బర్త్‌రప్ చేయాలని ఆ లేఖలో కోరారు

Update: 2022-06-27 07:10 GMT

మహారాష్ట్ర గవర్నర్ కు ఏక్‌నాథ్ షిండే లేఖ రాశారు. ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని బర్త్‌రప్ చేయాలని ఆ లేఖలో కోరారు. అసమ్మతి వర్గంలో ఉన్న ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్ కు లేఖ రాశారు. ప్రస్తుతం గౌహతిలో ఉన్న ఏక్‌నాథ్ షిండే శిబిరంలో యాభై మంది వరకూ ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతున్నారు. ఇందులో దాదాపు నలభై మంది శివసేనకు చెందిన ఎమ్మెల్యేలే. ఉద్ధవ్ ప్రభుత్వాన్ని వెంటనే బర్త్‌రఫ్ చేయాలంటూ గవర్నర్ కు లేఖ రాయడం చర్చనీయాంశమైంది.

ఎమ్మెల్యేల సంతకాలతో...
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొట్యారి కరోనా నుంచి కోలుకుని నిన్ననే రాజ్ భవన్ కు చేరుకున్నారు. ఒకవైపు షిండే సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు మరోవైపు గవర్నర్ కు లేఖ రాశారు. డిప్యూటీ స్పీకర్ మాత్రం పార్టీ చీఫ్ విప్ గా అజయ్ చౌదరిని గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిని సవాల్ చేస్తూ షిండే సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. గవర్నర్ ఆహ్వానం మేరకు షిండే వర్గం ఎమ్మెల్యేలు ముంబయికి చేరుకునే అవకాశాలున్నాయి. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News