నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి

నేడు శ్రీకృష్ణాష్ణమి పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు

Update: 2025-08-16 02:31 GMT

నేడు శ్రీకృష్ణామి పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఎక్కువగా ఇస్కాన్ టెంపుల్స్ లో భక్తులు రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆ దేవదేవుడిని దర్శించుకుని ఆశీర్వచనాలు పొందేందుకు భక్తులు బారులు తీరారు. దీంతో హైదరాబాద్ లోనూ పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

ఇస్కాన్ ఆధ్వర్యంలో...
మరొకవైపు ఇస్కాన్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నారు. ద్వారక వంటి ఆలయంతోపాటు అనేక శ్రీకృష్ణుడి ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించి భక్తులు ఇబ్బంది పడకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఉట్టి కొట్టే సంప్రదాయం ఉండటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు కూడళ్లిలో కూడా ఈ ఏర్పాట్లను నిర్వాహవకులు చేశారు.


Tags:    

Similar News