బ్రేకింగ్ : షిండే కు డిప్యూటీ స్పీకర్ షాక్

శివసేన రెబల్ గ్రూపుకు డిప్యూటీ స్పీకర్ షాక్ ఇచ్చారు. షిండే పంపిన జాబితాలో ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీ చేశారన్నారు

Update: 2022-06-24 06:39 GMT

శివసేన రాజకీయాలు క్షణక్షణానికి మారుతున్నాయి. ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. డిప్యూటీ స్పీకర్ నరహరి షిండే పంపిన ఎమ్మెల్యేల జాబితాను పరిశీలించారు. వాటిలో ఎక్కువ మంది ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీ జరిగినట్లు గుర్తించినట్లు తెలిపారు. దీంతో షిండే జాబితాపై నమ్మకం లేదని నరహరి వ్యాఖ్యానించడంతో షిండే వర్గానికి షాక్ ఇచ్చినట్లే తెలుస్తోంది. ఎమ్మెల్యేల సంతకాలను పరిశీలించిన తర్వాతనే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని డిప్యూటీ స్పీకర్ తెలిపారు.

చీఫ్ విప్ పదవి నుంచి....
ఏక్‌నాథ్ షిండే తనకు మద్దతిస్తున్న 37 మంది ఎమ్మెల్యేల సంతకాలతో డిప్యూటీ స్పీకర్ కు లేఖ పంపారు. తనను పార్టీ చీఫ్ విప్ గా తొలగించడాన్ని తప్పుపట్టారు. ఎక్కువ మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని షిండే ఆ లేఖలో పేర్కొన్నారు. ఉద్ధవ్ థాక్రే కు తనను తొలగించే అధికారం కూడా లేదని తెలిపారు. అయితే లేఖను పరిశీలించిని డిప్యూటీ స్పీకర్ నరహరి ఆ లేఖలో శివసేన ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీలు జరిగాయని తాను గుర్తించినట్లు తెలిపారు. దీంతో ఏక్‌నాథ్ షిండే వర్గానికి స్పీకర్ షాక్ ఇచ్చినట్లయింది.


Tags:    

Similar News