పీవోకే ప్రజలు మన కుటుంబమే

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రజలు ముమ్మాటికీ మన సొంత కుటుంబసభ్యులేనని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.

Update: 2025-05-30 11:45 GMT

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రజలు ముమ్మాటికీ మన సొంత కుటుంబసభ్యులేనని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. స్వచ్ఛందంగా భారతదేశ ప్రధాన స్రవంతిలోకి పీవోకే ప్రజలు వచ్చేరోజు ఒకటి వస్తుందని అన్నారు. భౌగోళికంగా, రాజకీయంగా భారత్ నుంచి దూరంగా జీవిస్తున్న మన సోదరులంతా ఏదో ఒక రోజు మళ్లీ భారతదేశ ప్రధాన ప్రసంతిలో కలిసి నడుస్తారని ధీమా వ్యక్తం చేశారు.


పీవోకేలోని వాళ్లంతా మన సొంత కుటుంబసభ్యులేనని గట్టిగా విశ్వసిస్తానని, ఏదో కొద్దిమంది తప్పుడు మార్గంలో పయనిస్తున్నారు గానీ అక్కడి వాళ్లలో చాలా మందికి భారత్‌తో దృఢసంబంధాలు ఉన్నాయన్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషించడానికి పెద్దగా ఖర్చుకాదని, కానీ ఉగ్రవాదం తాలూకు విపరిణామాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు రాజ్‌నాథ్‌ సింగ్‌.

Tags:    

Similar News