వచ్చే నెల 1వ తేదీన కేంద్ర బడ్జెట్
పార్లమెంటు సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. బడ్జెట్ సమావేశాల తేదీని ప్రకటించారు.
పార్లమెంటు సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. బడ్జెట్ సమావేశాల తేదీని ప్రకటించారు. ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకూ తొలి విడత బడ్జెట్ సమాేవశాలు జరుగుతాయి. మార్చి పదో తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకూ రెండో విడత సమావేశాలు జరగనున్నాయి.
రెండు విడతలుగా సమావేశాలు...
ఈ సమావేశాల సందర్భంగా 2025 -2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ లో అనేక వర్గాలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలిసింది. ప్రధానంగా ఆదాయపు పన్ను మినహాయింపులో మరింత వెసులుబాటు కల్పించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.