Corona Virus : వామ్మో.. విజృంభిస్తున్న కరోనా వైరస్...పెరుగుతున్న మరణాల సంఖ్య
కరోనా వైరస్ వేగంగా భారత్ లో వ్యాప్తి చెందుతుంది. మే 25వ తేదీ నుంచి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి
కరోనా వైరస్ వేగంగా భారత్ లో వ్యాప్తి చెందుతుంది. మే 25వ తేదీ నుంచి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఈ వేరియంట్ ప్రమాదకరం కాకపోయినప్పటికీ కొంత ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తమ పనులను మానుకుని హోం ఐసొలేషన్ లోనే ఉండాలి. హోం ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతూ కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నప్పటికీ గతంలో మాదిరిగా కరోనా వైరస్ సోకిన వెంటనే ఆ వ్యక్తితో కాంటాక్టు అయిన వారిని పట్టుకుని పరీక్షలు నిర్వహించాలి.
ఈ వేరియంట్ కేసులు...
కానీ ఇప్పటి వరకూ అది జరగడం పోవడంతోనే కేసుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. భారత్ లో వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ అని వైద్యులు నిర్ధారించారు. ఇది ప్రమాదకరం కాకపోయినప్పటికీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తుంది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 498 మందికి పాజిటివ్ గా తేలడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. దీంతో భారత్ లో కరోనా కేసుల సంఖ్య ఐదు వేలకు దాటింది. ప్రధానంగా వయసుతో సంబంధం లేకుండా ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
అత్యధికంగా...
ప్రధానంగా అత్యధికంగా కేరళలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం భారత్ 5,364 కరోనా యాక్టివ్ కేసులు ఉంటే, అందులో ఒక్క కేరళలోనే 1,679 కేసులు నమోదయ్యాయి. గుజరాత్ లో తర్వాత 615, పశ్చిమ బెంగాల్ 596, ఢిల్లీలో 592, మహారాష్ట్రలో 548, కర్ణాటకలో 451 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నాలుగు మరణాలు సంభవించాయి. కేరళలో ఇద్దరు, పంజాబ్, కర్ణాటకలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఇప్పటి వరకూ భారత్ లో యాభై ఐదు మంది కరోనా వైరస్ తో మరణించారు. అయితే డిశ్చార్జ్ అయ్యేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 4,724 మంది డిశ్చార్జ్ అయ్యారు.