Corona Alert : మళ్లీ కరోనా వైరస్ ముప్పు.. జాగ్రత్తలు పాటించకపోతే అంతే మరి

కరోనా వైరస్ మరోసారి ప్రబలుతుంది. అనేక కేసులు వెలుగు చూస్తున్నాయి

Update: 2025-05-23 03:40 GMT

కరోనా వైరస్ మరోసారి ప్రబలుతుంది. అనేక కేసులు వెలుగు చూస్తున్నాయి. భారత్ లోనూ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుంది. కేసులు స్వల్ప సంఖ్యలోనే ఉన్నప్పటికీ వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని వైద్యులు తెలిపారు. కొత్త వేరియంట్ తో కరోనా వైరస్ ముందుకు వస్తుందని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలెర్ట్ జారీ చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లే సమయంలో మాస్క్ లను ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, బయటకు వెళ్లివచ్చినప్పుడు శానిటైజర్స్ తో చేతులను శుభ్రం చేసుకోవాలని చెబుతుంది.

లక్షణాలు కనిపిస్తే...
తాజాగా ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో ఒక వివాహితకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. ప్రజలు అందరూ ప్రభుత్వం తెలిపిన సూచనలు పాటించాలని కోరింది. ప్రజలు అవసరమైతే తప్ప రద్దీ ప్రదేశాలకు వెళ్లవద్దని, ఏమాత్రం జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులు సంప్రదించి కరోనా పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, బాలింతలు, చిన్నారులు తగిన చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. చిన్నపాటి జలుబు అని నిర్లక్ష్యం చేయవద్దని ఏ మాత్రం తేడా కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు.
తీసుకోవాల్సిన చర్యలు :
1. ప్రార్థన సమావేశం, సామాజిక సమావేశాలు, పార్టీలు, కార్యక్రమాలు వంటి అన్ని సామూహిక సమావేశాల్లో పాల్గొనటం తగ్గించాలి.
2. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్‌లు మరియు విమానాశ్రయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి.
3. వృద్ధులు మరియు గర్భిణీ స్త్రీలు,అవసరం లేనివారు, తప్పనిసరిగా ఇంటి లోపలే ఉండాలి.
4. పరిశుభ్రతను పాటించాలి. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోండి, దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు వాటిద్వారా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోండి మరియు మీ ముఖాన్ని ఆ చేతులతో తాకకుండా ఉండండి.
5. అధికంగా రద్దీ ఉండే ప్రమాదకర ప్రాంతాలలో మాస్క్‌లు ధరించాలి.
6. మీకు లక్షణాలు ఉంటే పరీక్షించుకోండి
7. కోవిడ్ ప్రభావిత దేశాలకు ప్రయాణించిన వ్యక్తులు పరీక్షలు చేయించుకోవాలి.
సాధారణ లక్షణాలివే:
కరోనా లక్షణాలు వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయని వైద్యలు తెలిపారు. జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్కు కారటం లేదా ముక్కు దిబ్బడ, వికారం, వాంతులు లేదా విరేచనాలు. ఈలక్షణాలు గమనించినట్లయితే నిర్ధారణ మరియు చికిత్స కోసం వైద్యుడిని సంప్రదించాలి.
8. మీరు అనారోగ్యంగా ఉంటే ఇంట్లోనే ఉండాలి. అనారోగ్యంగా అనిపిస్తే, ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం మరియు ఇతరులను కలవకుండా ఉండటం ద్వారా ఇతరులను రక్షించండి.


Tags:    

Similar News