Corona Virus : . పోయిందనుకున్న పీడ మళ్లీ మొదలయిందే.. ఒక్కసారిగా పెరిగిన కేసులు

భారత్ లో మళ్లీ కరోనా వైరస్ ప్రమాద ఘంటికలను మోగిస్తుంది. ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది

Update: 2023-12-18 06:43 GMT

corona virus

భారత్ లో మళ్లీ కరోనా వైరస్ ప్రమాద ఘంటికలను మోగిస్తుంది. ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఒక్కరోజులోనే దేశంలో 335 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు మరణాలు కూడా సంభవించడం మరింత ఆందోళనకు గురి చేస్తుంది. ఒక్కరోజులోనే ఐదుగురు మృతి చెందారు. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమయింది. అన్ని రాష్ట్రాలనూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ చేసింది. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది.

24 గంటల్లో...
భారత్ లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 335 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు కరోనా వైరస్ కారణంగా మరణించారు. వీరిలో నలుగురు కేరళ రాష్ట్రంలోనే మరణించారు. మరొకరు ఉత్తర్‌ప్రదేశ్ లో మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గత రెండేళ్లుగా కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. వ్యాక్సినేషన్ ను వేగంగా వేయడంతో మరణాల సంఖ్య కూడా లేదు. వైరస్ కేసులు కూడా తగ్గాయి. దీంతో ప్రజలు సాధారణ జీవితానికి అలవాటుపడిపోయారు.
అప్రమత్తంగా లేకపోతే...
దీంతో కరోనా వైరస్ పీడ దేశాన్ని వదిలిపోయిందనే అందరూ భావించారు. కానీ మొదలయింది. పోయిందనుకున్న పీడ మళ్లీ మొదలయిందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో 1,701 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా కేసులు ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 4.50 కోట్లు నమోదు కాగా, అందులో 4.46 కోట్ల మంది కోలుకుననారు. రికవరీ రేటు 98.81 శాతంగా ఉన్నప్పటికీ చలికాలం ఈ వైరస్ మరింత ప్రబలే అవకాశముందంటున్నారు. కేరళలో కొత్తరకం వేరియంట్ జేఎన్ 1 కేసులు కూడా నమోదుకావడంతో మరింత ఆందోళనకు గురి కావాల్సి వస్తుంది. ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు కోరుతున్నారు.


Full View


Tags:    

Similar News