భారత్ లో ఈరోజు కరోనా కేసులు ఎన్నంటే?

భారత్ లో కరోనా కేసులు మూడు రోజుల నుంచి బాగా తగ్గుతున్నాయి. ఈరోజు కూడా రెండు వేల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి.

Update: 2022-10-07 05:00 GMT

భారత్ లో కరోనా కేసులు మూడు రోజుల నుంచి బాగా తగ్గుతున్నాయి. ఈరోజు కూడా రెండు వేల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 1,997 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 2,13,123 మందికి వైద్య పరీక్షలు చేయగా ఈ కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. రికవరీ రేటు శాతం 98.75 శాతంగా నమోదయిందని అధికారులు వెల్లడించారు.

యాక్టివ్ కేసులు...
దేశంలో ఇప్పటి వరకూ 4.45 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడగా అందులో 4.40 కోట్ల మంది చికిత్స పొంది కోలుకున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా కారణంగా 5,28,754 మంది మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం భారత్ లో 30,362 యాక్టివ్ కేసులున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుంది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 218.88 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.


Tags:    

Similar News