Corona Virus : మరణాలూ పెరుగుతున్నాయ్
ఇండియాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది
corona virus cases are increasing in india.
ఇండియాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. చలి కాలం కావడంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశ వ్యాప్తంగా 602 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
602 కేసులు ...
కరోనా వైరస్ కారణంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశ వ్యాప్తంగా ఐదుగురు మరణించారు. నిన్నటి కంటే ఈరోజు కేసుల సంఖ్య పెరుగుతుండంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 4440 గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.