భారత్ లో ఈరోజు పెరిగిన కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా 7,189 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Update: 2021-12-25 07:05 GMT

భారత్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా 7,189 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలీస్తే మరణాల సంఖ్య కొంచెం తగ్గింది. 387 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,42,08,926 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 77,032 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

వ్యాక్సినేషన్....
భారత్ లో ఇప్పటి వరకూ 3,52,36,049 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,78,802 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,41,69,76,774 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.


Tags:    

Similar News