విద్యాసంస్థల్లో కరోనా టెన్షన్.. 72 గంటల్లో వందమందికి

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. విద్యాసంస్థల్లో భారీ సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది

Update: 2021-12-06 12:49 GMT

దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒకవైపు ఒమిక్రాన్ కేసులు పదుల సంఖ్యలో నమోదవుతుండగా.. కోవిడ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా విద్యాలయాల్లో కరోనా కలకలం రేపుతోంది. నిన్న కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 43 మందికి కోవిడ్ పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. మరికొంతమంది విద్యార్థుల రిజల్ట్స్ రావాల్సి ఉండగా.. కాలేజీ యాజమాన్యం సెలవులు ప్రకటించింది.

భారీగా కేసులు..
తాజాగా కర్ణాటకలోని మరో విద్యాలయంలో పదుల సంఖ్యలో విద్యార్థులకు పాజిటివ్ గా నిర్థారణ అయింది. కర్ణాటకలోని చిక్ మంగళూరు జిల్లాలో గల జవహార్ నవోదయ విద్యాలయంలో 59 మంది విద్యార్థులకు, 10 మంది సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. దీంతో వీరందరినీ ఐసోలేషన్ చేసి చికిత్స అందజేస్తున్నట్లుగా ఆ జిల్లా ఆరోగ్య అధికారి తెలిపారు. అలాగే వారంరోజుల క్రితం కర్ణాటకలోనే ఉన్న ధర్వాడ్ జిల్లాలో మరో 306 మంది విద్యార్థులకు కరోనా సోకింది. రెండు డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నప్పటికీ.. భారీ సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. రెండ్రోజుల వ్యవధిలో తెలంగాణ, కర్ణాటకల్లోని విద్యాసంస్థల్లో 100కి పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం గుబులు రేపుతోంది


Tags:    

Similar News