Congress : నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నేడు జరగనుంది. కులగణనపై చర్చించనుంది

Update: 2025-05-02 02:23 GMT

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నేడు జరగనుంది. ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలపై చర్చించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి, సుఖ్వీందర్ హాజరు కానున్నారు.

కులగణనపై చర్చ...
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కులగణనపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కులగణనపై ప్రభుత్వానికి ఏమేం సూచనలు చేయాలన్నది ఈ సమావేశంలో చర్చిస్తారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు నుంచి కాంగ్రెస్ కులగణన చేయాలని డిమాండ్ చేస్తూ వస్తుంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశముంది.


Tags:    

Similar News