కేంద్రంపై అవిశ్వాసం : కాంగ్రెస్, బీఆర్ఎస్ నోటీసులు

పార్లమెంటులో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. ప్రధానితో పాటు తమకు కూడా పలు అంశాలు లేవనెత్తే అవకాశం..

Update: 2023-07-26 06:44 GMT

మణిపూర్ ఘటనపై పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రకటన చేయాల్సిందేనని విపక్షాల కూటమి "ఇండియా" పట్టుబట్టింది. కేంద్ర ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం (no confidence motion) అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమైంది. లోక్ సభలో కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గొగొయ్, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు స్పీకర్ కు నోటీసులిచ్చినట్లు కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ వెల్లడించారు. మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నోటీసు ఇచ్చారు.

పార్లమెంటులో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. ప్రధానితో పాటు తమకు కూడా పలు అంశాలు లేవనెత్తే అవకాశం ఉంటుందని విపక్షాల కూటమి ఆలోచన. ఈ మేరకు ఇప్పటికే విపక్షాల నేతలు ముసాయిదా కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే స్పీకర్ కు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అవిశ్వాసంపై నోటీసులిచ్చారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై లోక్ సభ సెక్రటరీ జనరల్ కు ఎంపీ నామా రాసిన లేఖలో.. రూల్ 198(బీ) ప్రకారం లోక్ సభలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్నట్లు తెలిపారు. లోక్ సభ బిజినెస్ లో ఈ నోటీసును కూడా చేర్చాలని ఆయన సెక్రటరీ జనరల్ ను కోరారు.


 






Tags:    

Similar News