కరోనా ఉద్ధృతి - కేరళలో సండే సంపూర్ణ లాక్ డౌన్

ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకూ నిత్యావసర సరుకుల దుకాణాలు మాత్రం తెరిచి ఉంటాయి. అలాగే

Update: 2022-01-23 10:50 GMT

దేశ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి పెరిగిపోతోంది. రాష్ట్రాల్లో రోజువారీ నమోదవుతున్న కేసులు అందరిలోనూ ఆందోళన రేపుతున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్లు విధిస్తూ.. కేసులను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కేరళ కూడా అదే బాటలో వెళ్తోంది. ఈ రోజు, జనవరి 30 (రెండు ఆదివారాలు) సంపూర్ణ లాక్ డౌన్ విధించింది. ఈ సమయంలో అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది కేరళ సర్కార్.

ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకూ నిత్యావసర సరుకుల దుకాణాలు మాత్రం తెరిచి ఉంటాయి. అలాగే అత్యవసర పనులు ఉన్నవారు.. అందుకు తగిన పత్రాలను చూపిస్తేనే ప్రయాణాలకు అనుమతిస్తున్నారు. ప్రైవేట్ వాహనాలను అనుమతించడం లేదు. అలాగే హోటల్స్ లో కేవలం పార్శిళ్లకు మాత్రమే అనుమతి. మెడికల్ స్టోర్లు, మీడియా సంస్థలు, టెలికాం, ఇంటర్నెట్ రంగాలకు చెందినవారికి లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. శనివారం ఒక్కరోజే కేరళలో 45,136 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా.. అక్కడి పాజిటివ్ కేసుల సంఖ్య 55,74,702కి చేరుకున్నాయి.


Tags:    

Similar News