ఉత్తరాది రాష్ట్రాల్లో కోల్డ్‌వేవ్

ఉత్తరాది రాష్ట్రాల్లో కోల్డ్‌వేవ్ కొనసాగుతుంది.

Update: 2026-01-06 04:24 GMT

ఉత్తరాది రాష్ట్రాల్లో కోల్డ్‌వేవ్ కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా చలితీవ్రత ఎక్కువగా ఉంది. మరికొద్ది రోజుల పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ,ఈశాన్య రాష్ట్రాల్లోనూ గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఢిల్లీలోనూ తగ్గిన...
దేశ రాజధాని ఢిల్లీలోను మరింత ఉష్ణోగ్రత తగ్గడంతో ప్రజలు ఉదయం వేళ బయటకు రావడానికి భయపడిపోతున్నారు. మరొకవైపు పొగమంచు తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సింగిల్‌ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరికొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News