సామూహిక వివాహ వేడుకలో తాళి కట్టిన సీఎం కొడుకు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన కుమారుడి వివాహాన్ని అత్యంత నిరాడంబరంగా జరిపించారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన కుమారుడి వివాహాన్ని అత్యంత నిరాడంబరంగా జరిపించారు. ఉజ్జయినిలో ఒక సామూహిక వివాహ వేడుకలో మరో 21 జంటలతో పాటు తన చిన్న కుమారుడు అభిమన్యు యాదవ్ వివాహాన్ని ఆయన ఘనంగా నిర్వహించారు. వేర్వేరు సామాజిక, ఆర్థిక నేపథ్యాలకు చెందిన 22 జంటలు ఒకే వేదికపై ఒక్కటయ్యాయి. యోగా గురు రాందేవ్ బాబా ఈ జంటలన్నింటికీ వేదమంత్రాల సాక్షిగా వివాహ క్రతువును జరిపించారు. ఈ వేడుకకు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, దుర్గాదాస్ ఉయికే హాజరయ్యారు.