చంద్రయాన్-3 పయనంలో మరో సూపర్ సక్సెస్
చంద్రయాన్-3 కీలక ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసింది
చంద్రయాన్-3 కీలక ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. భూకక్ష్య నుండి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. శనివారం రాత్రి గం.7.15 సమయానికి చంద్రుడి కక్ష్యలోకి వెళ్లింది. జులై 14న ప్రయోగించగా.. చంద్రయాన్-3ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను ఇస్రో నేడు విజయవంతంగా పూర్తి చేసింది. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ నుండి ఈ పనిని పూర్తీ చేశారు. చంద్రయాన్-3 చంద్రుడి కక్ష్యలో పద్దెనిమిది రోజుల పాటు తిరగనుంది. ఆగస్ట్ 23 లేదా 24న దక్షిణ ధృవంపై ల్యాండ్ కానుంది.
చంద్రయాన్-3ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 2023 జూలై 14న ప్రయోగించారు. అప్పటి నుండి ఇది విజయవంతంగా ఐదు ఆర్బిట్-రైజింగ్ మేన్యువర్ అమలు చేసింది. చంద్రయాన్ భూమి చుట్టూ ఆగస్టు 1న ఐదవ కక్ష్య ని విజయవంతంగా పూర్తి చేసి భూమిని వీడింది. దీంతో చంద్రయాన్-3 చంద్రుడి పైకి 3.8 లక్షల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇస్రో ప్రణాళిక ప్రకారం ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది చంద్రయాన్ -3.