Breaking : ఫాస్టాగ్ పై కేంద్రం కీలక నిర్ణయం
టోల్ ఫీజు వసూలులో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
టోల్ ఫీజు వసూలులో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు15వ తేదీ నుంచి ఫాస్టాగ్ వసూలులో కొత్త విధానాన్ని అమలులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫాస్టాగ్ మూడు వేల రూపాయలు చెల్లిస్తేఏడాదిలో రెండు వందల ట్రిప్పులను ప్రయాణంచే వీలుంది. దేశంలో ఎక్కడైనా మూడు వేల రూపాయలు చెల్లించి ఏడాది కాలంపాటు రెండు వందల ట్రిప్పులను ప్రయాణించే వీలుంటుంది.
ఆగస్టు పదిహేనో తేదీ నుంచి...
ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ఈ కొత్త విధానం అమలు కానుంది. అయితే డెయిలీ తిరిగే ట్రిప్పులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ప్రధానంగా అద్దెకు తిప్పే వాహనాలు, లారీలు, బస్సులకు ఈ పథకం ఉపయోగపడుతుంది. మూడు వేల రూపాయలు ఒకసారి చెల్లిస్తే చాలు దేశ వ్యాప్తంగా ఎక్కడికైనా టోల్ గేట్ లో రెండు వందల ట్రిప్పులు ప్రయాణించేవీలు కల్పించింది.