కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు దశళ్లో కులగణనను దేశ వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు దశళ్లో కులగణనను దేశ వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించింది. తొలిదశలో ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్, లడాఖ్, హిమాచల్ ప్రదేశ్ లో కులగణన చేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది అక్టోబరు 1 నుంచి తొలి దశలోనూ, రెండో దశ మార్చి 27 వ తేదీ నుంచి రెండో దశ కులగణన చేయాలని నిర్ణయించింది.
కేంద్ర మంత్రి మండలిలో...
అనేక రాజకీయ పార్టీల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని కులగణన చేయాలని నిర్ణయించింది. కులగణన చేసి అందుకు అనుగుణంగా జనాభా లెక్కలు కూడా చేయాలని నిర్ణయించింది. జనాభా లెక్కల ప్రక్రియను కూడా 2027 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి మండలి సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఒకేసారి కులగణనతో పాటు జనాభా లెక్కలు కూడా చేయాలని ఈ నిర్ణయాన్ని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు. దీంతో పాటు జులై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు పన్నెండో తేదీ వరకూ ఈ సమావేశాలు జరగనున్నాయి.