థర్డ్ వేవ్ నేపథ్యంలో కేంద్రం అలెర్ట్
కరోనా మూడో దశను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కరోనా మూడో దశను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒమిక్రాన్ రూపంలో భారత్ లో మూడో దశ వచ్చే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చేస్తున్న హెచ్చరికలతో రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించింది.
రాష్ట్రాల పరిధిలో....
ప్రధానంగా రాష్ట్రాలు తమ ప్రాంతాల్లో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని సూచించింది. టెలి వైద్య సేవలను విస్తరించాలని, జిల్లా ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ యూనిట్లు ప్రారంభించాలని, కోవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచడంతో పాటు ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యాని పెంచాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఆక్సిజన్ ప్లాంట్ లను వీలయినన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరింది.