టోల్ గేట్ వద్ద కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలివే
దేశంలోని జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది.
దేశంలోని జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. ఫాస్టాగ్ లేని వాహనదారులకు స్పల్ప ఊరట కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. టోల్ రుసుం చెల్లింపుల్లో రెండు కొత్త నిబంధనలు తెచ్చిన కేంద్రం ప్రభుత్వం రెండు కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఫాస్టాగ్ లేని వాహనాలకు ఇప్పటి వరకూ టోల్ గేట్ వద్ద రెండింతల టోల్ గేట్ ఫీజు చెల్లించాల్సి వచ్చేంది.
నవంబరు 15వ తేదీ నుంచి...
అయితే కొత్త నిబంధనల ప్రకారం యూపీఐ ద్వారా అయితే టోల్ రుసుం 1.25 రెట్లు చెల్లిస్తే సరపోతుంది. నగదు రూపంలో అయితే.. రెండింతలు చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ వసూలు వ్యవస్థ విఫలమైతే ఉచితంగా వెళ్లిపోవచ్చని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ తెలిపింది. దేశంలోని అన్ని జాతీయ రహదారులపై వచ్చే నెల 15వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.