కోవిడ్ వ్యాక్సిన్ లకు.. గుండె పోటు మరణాలకు సంబంధం లేదు
దేశంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది
దేశంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తర్వాత దేశంలో ఆకస్మిక మరణాలు పెరుగుతున్నాయన్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. ఎక్కువ మంది యువకులు సయితం గుండెపోటుతో మరణిస్తున్నారని, ఇందుకు కోవిడ్ వ్యాక్సిన్ లు కారణమన్న వాదనను కేంద్రప్రభుత్వం తోసి పుచ్చింది.
పరిశోధనలు చేసిన అనంతరం...
అనేక సంస్థలు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించాయిని పేర్కొన్నారు. మరణాలకు, కోవిడ్ వ్యాక్సిన్ లకు సంబంధం లేదని తెలిపారు. అనారోగ్య సమస్యలే ఆకస్మిక మరణాలకు, గుండెపోటుకు గురయి మరణించడం కారణమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఐసీఎంఆర్, ఎస్సీడీసీ, ఎయిమ్స్ పరిశోధనల్లో ఈ విషయం వెల్లడయిందని తెలిపింది. ఆకస్మికంగా మరణించిన వారి హెల్త్ రికార్డులను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది.