వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ గుడ్ న్యూస్

ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2026-01-02 03:13 GMT

ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. బిఎస్ఎన్ఎల్ కీలక ప్రకటన చేసింది. బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా ‘వాయిస్ ఓవర్ వైఫై’ సేవలను ప్రారంభించింది. మొబైల్ సిగ్నల్ లేని ప్రాంతాల్లో కూడా వైఫై కనెక్షన్ సాయంతో ఎలాంటి అంతరాయం లేకుండా వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ సంస్థ తెలిపింది.

సిగ్నల్ లో అంతరాయం లేకుండా...
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని ప్రకటించింది. ఇకపై సిగ్నల్ సమస్యలు, కాల్ డ్రాప్స్ ఉండవని సంస్థ స్పష్టం చేసింది. దేశంలోని మారు మూల ప్రాంతాలకు వెళ్లినా సిగ్నల్స్ సమస్య అనేది తలెత్తదని, ప్రతి ఒక్కరూ బీఎస్ఎన్ఎల్ సంస్థ సేవలను వినియోగించుకోవాలని కోరింది.


Tags:    

Similar News