నేడు నితిన్ నబీన్ బాధ్యతల స్వీకరణ
బీజేపీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ నేడు ఢిల్లీకి చేరుకోనున్నారు
బీజేపీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ నేడు ఢిల్లీకి చేరుకోనున్నారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలను చేపట్టనున్నారు. ఉదయం పది గంటలకు బీహార్ నుంచి న్యూ ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. నితిన్ నబీన్ కు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
భారీ స్వాగత ఏర్పాట్లు...
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆధ్వర్యంలో నితిన్ నబీన్ కు పెద్దయెత్తున స్వాగత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఉదయం పదకొండు గంటలకు బీజేపీ కార్యాలయానికి నితిన్ నబీన్ చేరుకోనున్నారు. అనంతరం పార్టీ పెద్దల సమక్షంలో ఆయన బాధ్యతలను చేపట్టనున్నారు. బీహార్ మంత్రిగా ఉన్న నితిన్ నబీన్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన సంగతి తెలిసిందే. తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయ్యే అవకాశం కూడా నితిన్ నబీన్ కు ఉండటంతో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి కార్యకర్తలు చేరుకుంటున్నారు.