బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నబీన్ సిన్హా

నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్ దాఖలు పూర్తయింది

Update: 2026-01-19 11:52 GMT

నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్ దాఖలు పూర్తయింది. అయితే ప్రస్తుతం ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ ఒక్కరేనామినేషన్ వేశారు. దీంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లే. నితిన్ నబీన్ తరుపున 37 సెట్ల నామినేషన్లను దాఖలయ్యాయి. రేపు అధికారికంగా జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశముంది. భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియకు సోమవారం అధికారికంగా శ్రీకారం చుట్టింది. పార్టీ 45 ఏళ్ల వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్‌ను అధ్యక్ష పదవికి ఎంపిక చేసే దిశగా అగ్ర నేతలు ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

ఒక్కడే నామినేషన్ దాఖలు చేయడంతో...
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలిసి నితిన్ నబిన్ నామినేషన్ పత్రాల సెట్‌ను ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కే. లక్ష్మణ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సీనియర్ నేతలు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, కిరణ్ రిజిజు హాజరయ్యారు.తరువాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖాండూ సహా పలువురు రాష్ట్ర నేతలు నితిన్ నబిన్‌కు మద్దతుగా మరో నామినేషన్ సెట్‌ను సమర్పించారు. గత నెలలోనే నితిన్ నబిన్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, హర్యానా సీఎం నయబ్ సింగ్ సైనీ, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా హాజరయ్యారు. బిహార్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, అస్సాం, జార్ఖండ్ సహా పలు రాష్ట్రాల నేతలు నితిన్ నబిన్‌కు మద్దతుగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.


Tags:    

Similar News