Bihar : నేడు బీహార్ ఎన్నికల షెడ్యూల్

బీహార్ ఎన్నికల షెడ్యూల్ నేడు విడుదల కానుంది. దీంతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది

Update: 2025-10-06 04:33 GMT

బీహార్ ఎన్నికల షెడ్యూల్ నేడు విడుదల కానుంది. బీహార్ ఎన్నికలతో పాటు దేశంలోని ఉప ఎన్నికల షెడ్యూల్ ను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో బీహార్ శాసనసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేయనుంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు...
బీహార్ శాసనసభకు కాలపరిమితి ముగియనుండటంతో ఎన్నికలు జరిపేందుకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ సమాయత్తమయింది. ఓటర్ల జాబితాను కూడా సవరించింది. అలాగే అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించింది. బీహార్ శాసనసభ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను కూడా నేడు విడుదల చేసే అవకాశముంది.


Tags:    

Similar News