Bihar : బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే
బీహార్ శాసనసభ సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది
బీహార్ శాసనసభ సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. ఈ ఎన్నికలు రెండు దశల్లో జరుగనున్నాయి. తొలి దశ పోలింగ్ నవంబర్ 6న, రెండో దశ నవంబర్ 11న జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపడతారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న, మొత్తం ప్రక్రియ 16న పూర్తవుతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, తొలి దశలో 121 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండో దశలో 122 నియోజకవర్గాలు పోలింగ్ జరగనున్నాయి.
రెండు దశల్లో...
రెండు దశల్లో పోలింగ్ నవంబర్ 6, 11వ తేదీల్లో రెండు దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తారు. మొదటి దశకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 10న జారీ అవుతుంది. నామినేషన్ల దాఖలుదినం అక్టోబర్ 17గా, పరిశీలన అక్టోబర్ 18న, ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 20గా నిర్ణయించారు. రెండో దశ గెజిట్ అక్టోబర్ 13న విడుదల అవుతుంది. దాఖలు చివరి తేదీ అక్టోబర్ 20, పరిశీలన అక్టోబర్ 21, ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 23. మొత్తం ఎన్నికల ప్రక్రియ నవంబర్ 16నాటికి పూర్తవుతుందని కమిషన్ పేర్కొంది.