Karnataka : కన్నడ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. రాహుల్ రాకతో వేడెక్కిందిగా?
కర్ణాటక పవర్ షేరింగ్ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కొద్ది రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ నేతలు నాయకత్వానికి తలనొప్పిగా మారారు. పవర్ షేరింగ్ లో నేతల మధ్య విభేదాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లు రెండు వర్గాలుగా విడిపోయారు. కర్ణాటక ఎన్నికలు జరిగిన సమయంలో కుదిరిన ఒప్పందాన్ని అమలు పర్చాలని డీకే వర్గం పట్టుబడుతుంది. నాడు ఎన్నికల సమయంలో సిద్ధరామయ్య తొలుత రెండునరేళ్లు, ఆ తర్వాత కాలం డీకే శివకుమార్ లు ముఖ్యమంత్రులుగా వ్యవహరించాలని అప్పట్లో నిర్ణయించారు.
పవర్ షేరింగ్ వివాదం...
అయితే కర్ణాటక పవర్ షేరింగ్ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అయితే ముఖ్యమంత్రి పదవిలో మార్పు లేదంటూ వార్తలు వచ్చిన క్రమంలో మరోసారి కర్ణాటకలో పొలిటికల్ హీట్ పెరిగింది.ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాహుల్ గాంధీతో భేటీ అయ్యేందుకు సన్నాహాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. మైసూరు వచ్చిన రాహుల్ గాంధీని సిద్ధరామయ్య కలుసుకున్నారు. అలాగే డీకే శివకుమార్ కూడా భేటీ అయ్యారు. తొలుత రాహుల్ గాంధీ విడివిడిగా ఇద్దరితో భేటీ అయి తర్వాత ఇద్దరితోనూ సమాలోచనలు జరిపారు.
విస్తరణ చేపడతారని...
ముఖ్యమంత్రి మార్పు అంశంలో వీరి మధ్య చర్చ జరిగినట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. గత ఏడాది సెప్టంబరు నెలలోనే సిద్ధరామయ్య పదవీ కాలం రెండున్నరేళ్లు ముగిసింది. అయినా మార్చకపోవడంతో డీకే వర్గం కాలు దువ్వడం ప్రారంభించింది దీంతో పాటు సిద్ధరామయ్య మంత్రివర్గ విస్తరణకు ప్లాన్ చేస్తున్నారని కేబినెట్ విస్తరణ లో డీకే శివకుమార్ మద్దతుదారులను బయటకు పంపే ప్రయత్నం చేయాలనుకుంటున్నారన్న ప్రచారం నేపథ్యంలో డీకే కూడా స్ట్రాంగ్ సిగ్నల్స్ అధినాయకత్వానికి పంపినట్లు సమాచారం. మంత్రి వర్గ విస్తరణ జరిగితే తమ వారిని తొలగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఇప్పటికే హైకమాండ్ కు ఆయన తెలిపినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో మరొకసారి కన్నడ రాజకీయాలు హీటెక్కినట్లయింది.