పండుగలకు కొత్త నిబంధనలు అమలు.. మరీ ముఖ్యంగా బక్రీద్ కోసం ?

అధికారులతో సమీక్ష అనంతరం.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిబంధనలను సదుపాయాలను అమలు చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్

Update: 2023-06-28 10:33 GMT

పండుగల విషయంలో యూపీ సర్కార్ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పండుగల సమయాల్లో భక్తులు అనుసరించాల్సిన విధానాలు, నిబంధనలను సూచించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పండుగలు నిర్వహించుకోవాలని ప్రజలకు తెలిపింది. ముఖ్యంగా.. రేపు బక్రీద్ పండుగ కావడంతో.. కొన్ని మార్గదర్శకాలు సూచించింది. బక్రీద్, ఆ తర్వాత వచ్చే శ్రావణి శివరాత్రి, నాగపంచమి, రక్షాబంధన్, మొహర్రం వంటి పర్వదినాల్లో భక్తులు.. ప్రభుత్వం ఆదేశించిన నిబంధనల మేరకు జరుపుకోవాలని సూచించింది. ఈ మేరకు అన్ని మతాల వారికి కొన్ని షరతులు విధించింది.

అధికారులతో సమీక్ష అనంతరం.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిబంధనలను సదుపాయాలను అమలు చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏ మతం వారైనా శాంతిభద్రతలను కాపాడేవిధంగా ఈ పండుగలను జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. బక్రీద్, మొహర్రం పర్వదినాల్లో రోడ్లపై ప్రయాణించేవారికి ఇబ్బందులు లేకుండా.. రోడ్డు భద్రతలను పాటించాలని మత పెద్దలతోను, విద్యావేత్తలతోను స్థానిక అధికారులు సంప్రదించాలని తెలిపారు. జూన్ 29న బక్రీద్ నేపథ్యంలో వివాదాస్పద స్థలాల్లో పశువులను బలివ్వడాన్ని నిషేధించారు. ముందుగానే నిర్ణయించిన ప్రదేశాల్లో ఆయా కార్యక్రమాలు చేసుకోవాలని, బలిచ్చే ప్రాంతాలపై అధికారులకు సమాచారమివ్వాలని స్పష్టం చేశారు. కన్వర్ యాత్ర సంప్రదాయబద్దంగా జరుపుకోవాలని అందరు సురక్షితంగా ఉండాలని దానికి తగిన సూచనలు పాటించాలన్నారు. ఆయా మార్గాల్లో మాసం విక్రయాలు, ఉత్పత్తులు ఉండకూడదని తెలిపారు.



Tags:    

Similar News