ముంచుకొస్తున్న ఏవియన్ ఫ్లూ

కేరళలోని మన్‌ర్‌కాడ్‌లో ప్రభుత్వం నిర్వహిస్తున్న పౌల్ట్రీ ఫామ్‌లో

Update: 2024-05-24 14:47 GMT

కేరళలోని మన్‌ర్‌కాడ్‌లో ప్రభుత్వం నిర్వహిస్తున్న పౌల్ట్రీ ఫామ్‌లో ఏవియన్ ఫ్లూ (H5N1) వ్యాప్తి చెందినట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. దీంతో భారీ ఎత్తున పెంపుడు పక్షులను చంపేయాలని అధికారులు నిర్ణయించారు. పౌల్ట్రీ ఫామ్ చుట్టూ 1 నుండి 10 కి.మీ వ్యాసార్థం నిఘా జోన్‌గా ప్రకటించారు. ఇక కొట్టాయం జిల్లాలో చికెన్, బాతు.. ఇతర పక్షులతో సహా పౌల్ట్రీ ఉత్పత్తుల అమ్మకం, దిగుమతిపై నిషేధం విధించారు.

కలెక్టరేట్‌లో జరిగిన సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ వి విఘ్నేశ్వరి తెలిపారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫారంలో దాదాపు తొమ్మిది వేల కోళ్లు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై-సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్ ఫారమ్‌లో పెద్ద సంఖ్యలో చనిపోయిన కోళ్ల నమూనాలను పరీక్షించిన తర్వాత H5N1 వ్యాప్తిని నిర్ధారించింది.


Tags:    

Similar News