భారత్ లో సెంచరీ దాటిన ఒమిక్రాన్.. అలర్ట్ గా ఉండాలన్న ఆరోగ్య శాఖ

డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించినట్లుగానే ప్రపంచవ్యాప్తంగా రోజువారీ ఒమిక్రాన్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి.

Update: 2021-12-17 12:45 GMT

డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించినట్లుగానే ప్రపంచవ్యాప్తంగా రోజువారీ ఒమిక్రాన్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్య చూస్తుంటే.. దడపుడుతోంది. తాజాగా భారత్ లో ఒమిక్రాన్ కేసులు సెంచరీ దాటేశాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకూ 98 కేసులు ఉండగా.. సాయంత్రానికి ఆ కేసుల సంఖ్య 101కి పెరిగింది. భారత్ లో మొత్తం 11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వ్యాప్తిచెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

అత్యధికంగా...
వీటిలో మహారాష్ట్రలో అత్యధికంగా 32 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా.. ఢిల్లీలో ఈ సంఖ్య 22కి పెరిగింది. ఇక రాజస్థాన్ లో 17, కర్ణాటకలో 8, తెలంగాణలో 9 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా.. గుజరాత్, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ లో కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దేశంలో రోజురోజుకూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.
ఒమిక్రాన్ కట్టడికి....
ఒమిక్రాన్ కట్టడికి కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, అర్హులైన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 23 వేల ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా.. ఒక్క బ్రిటన్ లోనే 11 వేల కేసులు నమోదయ్యాయని తెలిపింది.


Tags:    

Similar News