Breaking : జ్యుడిషియల్ కస్టడీకీ అరవింద్ కేజ్రీవాల్.. తీహార్ జైలుకు

అరవింద్ కేజ్రీవాల్ ను జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది

Update: 2024-04-01 06:29 GMT

అరవింద్ కేజ్రీవాల్ ను జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన తీహార్ జైలుకు తరలించనున్నారు. ఏప్రిల్ 15వ తేదీ వరకూ అరవింద్ కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ కస్టడీని విధించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఈడీ అధికారులు నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. అయితే మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరుపున న్యాయవాదులు కోరారు. కానీ కోర్టు మాత్రం జ్యుడిషియల్ కస్టడీకి పంపింది.

కస్టడీకి కోరినా...
గత నెల 22వ తేదీన కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే పది రోజులు కస్టడీకి కోర్టు అనుమతించింది. అయితే ఈరోజు కస్టడీకి అనుమతించకుండా జ్యుడిషియల్ రిమాండ్ కు ఆదేశించింి. ఆయనను తీహార్ జైలుకు తరలించనున్నారు. ఇప్పటి వరకూ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. దీంతో ఆయన ఇప్పుడైనా రాజీనామా చేస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News