నేటి నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్

నేటి నుంచి పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Update: 2022-01-03 02:35 GMT

నేటి నుంచి పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు లోపు పిల్లలకు నేటి నుంచి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దీనిపై మార్గదర్శకాలను విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలూ పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు తమ పేర్లను కూడా ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక మంది నమోదు చేసుకున్నారు.

దేశ వ్యాప్తంగా....
కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణుల హెచ్చరికలు, ఒమిక్రాన్ తీవ్రతతో పిల్లలకు వ్యాక్సినేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయంచింది. పెద్దలకు ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఫస్ట్ డోస్ వంద శాతం పూర్తి చేసి రెండో డోస్ కు సిద్ధమవుతున్నారు. పిల్లలకు మాత్రం కోవాగ్జిన్ టీకాలను మాత్రమే నేటి నుంచి ఇవ్వనున్నారు.


Tags:    

Similar News