నేటి నుంచి అమెరికా అదనపు సుంకాలు

నేటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువుల ఎగుమతులపై అదనపు సుంకాలు అమలులోకి రానున్నాయి

Update: 2025-08-27 02:21 GMT

నేటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువుల ఎగుమతులపై అదనపు సుంకాలు అమలులోకి రానున్నాయి. గతంలో విధించిన ఇవరవై ఐదు శాతానికి మరో ఇరవై ఐదు శాతం కలిపి భారత్ పై ఎగుమతుల భారం పడనుంది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే నలభై ఎనిమిది బిలియన్ డాలర్ల వ్యాపారాలపై ఈ సుంకాల ప్రభావం పడుతుంది. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందున భారత్ పై వత్తిడి తెచ్చేందుకు అమెరికా ఈ అదనపు సుంకాలు ట్రంప్ విధించారు.

భారత్ లో ఈ వస్తువులకు...
ట్రంప్ విధించిన అదనపు సుంకాలతో నేటి నుంచి భారత్ నుంచి ఎగుమతి అయ్యే జౌళి వస్తువులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, తోలు వస్తువులు, పాదరక్షలు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్తు, మెనాకికల్ యంత్రాల వంటి వాటిపై అదనపు సుంకాల ప్రభావం నేటి నుంచి పడనుంది. భారత్ మాత్రం ఇందుకు ధీటుగానే సమాధానం చెప్పనుంది. తాము చౌకగా లభ్యమవుతున్నందునే రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్నామని తెలిపింది. నేటి నుంచి ఈ వస్తువుల ధరల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనుంది.


Tags:    

Similar News