అమర్ నాథ్ యాత్రకు సూపర్ రెస్పాన్స్

అమర్ నాధ్ యాత్రకు మంచి స్పందన లభిస్తుంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు

Update: 2025-07-09 04:33 GMT

అమర్ నాధ్ యాత్రకు మంచి స్పందన లభిస్తుంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. తొలి ఆరు రోజుల్లో లక్ష మందికి పైగా భక్తులు అమర్ నాధ్ యాత్రలో పాల్గొని మంచు శివలంగాన్ని దర్శించుకున్నారు. లక్ష సంఖ్య దాటేయడంతో ఇంకా భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. అనంత్ నాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల పొడవైన నున్వాన్ - పహల్గాం, గాంర్ బాల్ జిల్లాలోని పథ్నాలుగు కిలోమీటర్ల బాల్తా్ల్ మార్గం నుంచి యాత్రికులు బయలుదేరి వస్తున్నారు.

రెండు మార్గాల్లోనూ...
రెండు మార్గాల్లోనూ భక్తుల సంఖ్య పెరుగుతుంది. 38 రోజుల పాటు కొనసాగుతున్న యాత్రలో ఇంకా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశముంది. పహాల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుందని భావించినప్పటికీ అనూహ్యంగా భక్తులు పెరగడంతో మరింత మంది దర్శనానికి వచ్చే అవకాశముంది. యాత్రకు వెళ్లే దారిలో భద్రతాదళాలు భారీగా బందోబస్తును నిర్వహిస్తున్నాయి.


Tags:    

Similar News