మా విమానం బాగుంది : ఎయిర్ ఇండియా సీఈవో

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై వచ్చిన ప్రాధమిక నివేదికపై ఎయిర్ ఇండియా సీఈవో స్పందించారు

Update: 2025-07-14 07:04 GMT

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై వచ్చిన ప్రాధమిక నివేదికపై ఎయిర్ ఇండియా సీఈవో స్పందించారు. విమానం ఇంజిన్ లో ఎలాంటి లోపం లేదని తెలిపారు. తమ విమాన ఇంజిన్ లో కూడా ఎలాంటి సమస్య లేదని ఆయన తెలిపారు. అలాగే నిర్వహణ విషయంలోనూ సమస్యలు లేవని ఎయిర్ ఇండియా సీఈవో చెప్పారు.

అన్ని రకాలుగా బాగుంది...
విమానం అన్ని విధాలుగా బాగుందన్న సీఈవో ప్రమాదం ఎందుకు జరిగిందన్నది విచారణలో తెలియాల్సి ఉందని తెలిపారు. గత నెలలో జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో వందల సంఖ్యలో మరణించిన నేపథ్యంలో ప్రభుత్వం అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఏఏఐబీ ప్రాధమిక నివేదికను సమర్పించింది. పైలట్లు కాక్ పిట్ లో మాట్లాడుకున్న మాటలను కూడా ప్రస్తావించింది. రెండు ఇంజిన్లు ఆగిపోయాయయని తెలిపింది.






Tags:    

Similar News