Breaking : పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం
పురుషులకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ అన్నా డీఎంకే నిర్ణయం తీసుకుంది
పురుషులకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ అన్నా డీఎంకే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్నికల మ్యానిఫేస్టోను ప్రకటించింది. అన్నాడీఎంకే ఎన్నికల మ్యానిఫేస్టోను ప్రకటించింది. ఈ మేరకు అన్నాడీఎంకే నేత పళనిస్వామి ఐదు కీలక హామీలను ప్రకటించారు. మహిళలకు రెండు వేల రూపాయలు ప్రతి నెల వారి అకౌంట్ లో జమ చేస్తామని తెలిపింది.
మహిళలకు నెలకు రెండు వేలు...
మరొకవైపు మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని తెలిపింది. పురుషులకు మాత్రం సిటీ బస్సుల్లోనే ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించాలని ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో భూమి కొని కాంక్రీట్ ఇళ్ల నిర్మాణాన్ని చేపడతామని తెలిపింది. అమ్మ టూ వీలర్ పథకం కింద ఐదు లక్షల మందికి అందచేస్తామని తెలిపింది. ఇందులో ఇరవై ఐదు వేల సబ్సిడీ కింద ఇస్తామని పళని స్వామి ప్రకటించారు.