Cyclone : తుఫాను ముప్పు తప్పినట్లే... రేమాల్ తో మనకు ఇబ్బంది లేదట

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుడం తుఫాను గా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2024-05-25 01:20 GMT

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుడం తుఫాను గా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల ఇరవై నాలుగు గంటల్లో తుఫానుగా మారే అవకాశముందని హెచ్చరించింది ఈ తుఫానుకు రేమాల్ గా పేరుపెట్టారు. అయితే ఈ తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్, తమిళనాడుపై పెద్దగా ప్రభావం చూపించదని కూడా తెలిపారు. అయితే మత్స్యకారులు మాత్రం చేపల వేటకు వెళ్లకుండా ఉండటమే మంచిదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

మత్స్యకారులు మాత్రం...
బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాను రేమాల్ ఈశాన్యదిశగా కదిలి బంగ్లాదేశ్ తీరంలో ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పై ప్రభావం చూపుతుందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను కారణంగా మత్స్యకారులు మాత్రం వేటకు వెళ్లవద్దని సూచించింది. తుఫాను ప్రభావం తప్పడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతాయని తెలిపింది.


Tags:    

Similar News